“ఇకపై రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో ఇవి చేయకండి!”.. నిబంధనలను కఠినతరం చేసిన భారతీయ రైల్వే.. ప్రయాణికులు పాటించాల్సిన కొత్త రూల్స్..!!!

రైళ్లలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించే వారిపై, అలాగే సెల్‌ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడే లేదా రీల్స్ చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వే హెచ్చరించింది. ముఖ్యంగా, రాత్రి 10 గంటల తర్వాత ఎవరూ బిగ్గరగా పాటలు వినడం లేదా మొబైల్‌లో గట్టిగా మాట్లాడటం చేయకూడదని, వినాలనుకునేవారు తప్పనిసరిగా ఇయర్‌ఫోన్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. అంతేకాకుండా, రాత్రి 10 గంటల తర్వాత లైట్లన్నీ ఆర్పివేసి, ఇతరులు నిద్రించడానికి అనుకూలంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను ఉల్లంఘించి తోటి ప్రయాణికులకు పదేపదే ఇబ్బంది కలిగించే వారికి, రైల్వే చట్టం 1989 ప్రకారం తొలిసారిగా రూ. 1,000 జరిమానా విధిస్తారు. అధికారుల హెచ్చరికను ఖాతరు చేయకుండా మళ్లీ అదే తప్పు చేస్తే రూ. 5,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ కలిపి విధించడంతో పాటు, వారిని మధ్యలోనే రైలు నుంచి దించేస్తారు. ప్రయాణికులు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి 139, 182, 1512 మరియు మహిళల భద్రత కోసం 1098 వంటి అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని రైల్వే శాఖ తెలిపింది.

అంతేకాకుండా, ప్రయాణికులు తమ ఫిర్యాదులను తక్షణం నమోదు చేయడానికి ‘రైల్ మదద్’ (Rail Madad) యాప్, వెబ్‌సైట్ లేదా ‘రైల్ వన్’ యాప్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం, ఆహార నాణ్యత లోపం లేదా తోటి ప్రయాణికుల వల్ల కలిగే ఇబ్బందులు.. ఇలా ఎలాంటి ఫిర్యాదునైనా ఫోటో, వీడియో లేదా ఆడియో రూపంలో నమోదు చేసిన తర్వాతి 10 నిమిషాల్లోనే రైల్వే అధికారులు నేరుగా వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఇకపై రైళ్లలో ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా ప్రయాణించేందుకు ఈ సాంకేతిక సదుపాయం ఎంతో దోహదపడనుంది.


Posted

in

by

Tags: