భారతదేశంలోని మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ (TRAI) ఒక కొత్త, అత్యంత కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం, ఇప్పటివరకు అమల్లో ఉన్న 28 రోజుల వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్లకు బదులుగా, ఇకపై పూర్తి 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన నెలవారీ ప్లాన్లను అన్ని కంపెనీలు తప్పనిసరిగా అందించాలని సూచించింది. ఈ సంచలన మార్పుతో కస్టమర్ల చిరకాల కోరిక నెరవేరే పరిస్థితి ఏర్పడింది.
ఈ కొత్త నిబంధన ద్వారా, వినియోగదారులు ఏడాది పొడవునా తరచూ రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటివరకు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉండగా, ఇకపై ఏడాదికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, రీఛార్జ్ చేసే గడువు కూడా గణనీయంగా పెరుగుతుంది.
ఇంతేకాకుండా, ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS) సేవలను మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను కూడా టెలికాం కంపెనీలు తప్పనిసరిగా అందించాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ కీలక ప్రకటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు, మొபைల్ వినియోగదారుల నుంచి భారీ స్పందనను, ప్రశంసలను అందుకుంటున్నాయి.

Leave a Reply