ఇంధన ఖర్చు ఏమాత్రం లేకుండా, పూర్తిగా విద్యుత్‌తో (కరెంట్‌తో) నడిచే ఆధునిక ప్రయాణికుల విమానాన్ని తయారు చేసి చైనా సరికొత్త రికార్డు సృష్టించింది.
విమాన ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల టికెట్ ధరలు ఎప్పుడూ గరిష్ట స్థాయిలోనే ఉంటున్నాయి. దానికి పరిష్కారంగానే ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించారు.
చైనా ప్రభుత్వ విమాన తయారీ సంస్థ కోమాక్ (COMAC) రూపొందించిన ఈ ‘CE-25A’ రకం ఎలక్ట్రిక్ విమానంలో ఒకేసారి 19 మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణించవచ్చు.
గత నవంబర్ 14న షాన్‌డాంగ్ (Shandong) ప్రావిన్స్‌లోని బిన్‌జౌ (Binzhou) నగరంలో, మనుషులను ఎక్కించుకుని ఈ విమానం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఎలాంటి ఇంధనం లేకుండా ఆకాశంలో ఏకధాటిగా 57 నిమిషాల పాటు ఎగిరి సత్తా చాటిన ఈ ఎలక్ట్రిక్ విమానం.. భవిష్యత్తులో విమాన ప్రయాణ చార్జీలను తగ్గించడంలో భారీ మార్పును తీసుకువస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply