ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే కాలంలో AI రంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న 5 ఉద్యోగాలు మరియు వాటి కోసం ఏం చదవాలి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి:
1. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ (Machine Learning Engineer)
మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు డేటా మరియు అల్గారిథమ్‌లను ఉపయోగించి సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తారు.
- అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో B.Tech/M.Tech.
- నైపుణ్యాలు: Python, R, TensorFlow, PyTorch.
- జీతం: భారత్‌లో ఏడాదికి ₹10-20 లక్షలు, విదేశాల్లో సుమారు $120,000 వరకు ఉండవచ్చు.
2. డేటా సైంటిస్ట్ (Data Scientist)
వ్యాపార పరమైన నిర్ణయాలను ఖచ్చితంగా తీసుకోవడానికి భారీ డేటా సెట్లను విశ్లేషించడం వీరి పని.
- అర్హత: డేటా సైన్స్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా.
- నైపుణ్యాలు: Python, SQL, గణాంకాల (Statistics) పరిజ్ఞానం.
- జీతం: భారత్‌లో ఏడాదికి ₹8-15 లక్షలు, విదేశాల్లో $100,000 కంటే ఎక్కువ.
3. AI రీసెర్చ్ సైంటిస్ట్ (AI Research Scientist)
కొత్త AI మోడల్స్ మరియు అల్గారిథమ్‌లను రూపొందించడంలో వీరు నిపుణులు.
- అర్హత: AI లేదా డీప్ లెర్నింగ్‌లో పీహెచ్డీ (PhD) లేదా కనీసం మాస్టర్స్ డిగ్రీ.
- ప్రాధాన్యత: రీసెర్చ్ పేపర్లు ప్రచురించిన అనుభవం ఉండాలి.
- జీతం: భారత్‌లో ఏడాదికి ₹15-25 లక్షలు, విదేశాల్లో $150,000 పైగా ఉండవచ్చు.
4. రోబోటిక్స్ ఇంజనీర్ (Robotics Engineer)
రోబోటిక్ యంత్రాలు మరియు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను డిజైన్ చేసి తయారు చేస్తారు.
- అర్హత: రోబోటిక్స్, AI/MLతో కూడిన మెకానికల్ ఇంజనీరింగ్.
- నైపుణ్యాలు: Matlab, C++.
- జీతం: భారత్‌లో ఏడాదికి ₹6-12 లక్షలు, విదేశాల్లో $90,000 కంటే ఎక్కువ.
5. AI ప్రొడక్ట్ మేనేజర్ (AI Product Manager)
AI ఉత్పత్తుల వ్యూహరచన మరియు అభివృద్ధికి నాయకత్వం వహిస్తారు.
- అర్హత: AI/ML పరిజ్ఞానంతో కూడిన MBA, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు.
- జీతం: భారత్‌లో ఏడాదికి ₹12-20 లక్షలు, విదేశాల్లో $110,000 పైగా ఉంటుంది.
