ఇక రౌడీలకు తావు లేదు.. ఒకే రోజులో పటాపంచలైన రౌడీయిజం.. చెన్నైలో 285 మంది అరెస్ట్.. పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ మెరుపు యాక్షన్.!

చెన్నై నగరంలో నేరాలను అదుపు చేయడంతో పాటు శాంతిభద్రతలను పకడ్బందీగా కాపాడేందుకు పోలీస్ విభాగం వరుసగా పలు కఠిన చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ ఏ. అమల్‌రాజ్ ప్రత్యక్ష ఆదేశాల మేరకు.. నగరం అంతటా రౌడీలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

గురువారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు కొనసాగిన ఈ విస్తృత తనిఖీల్లో.. హిస్టరీ షీటర్లు (రౌడీ షీటర్లు) సహా మొత్తం 285 మంది నేరస్థులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

నగరంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి ముమ్మర నిఘా కొనసాగించారు. పట్టుబడిన నిందితులను లోతుగా విచారిస్తున్నామని, నేరాలకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని చెన్నై నగర పోలీస్ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.


Posted

in

by

Tags: