“ఇక విమానంలో ఎగిరితే జేబులు ఖాళీయే” రేపటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు.. ఇండిగో సంస్థ సంచలన ప్రకటన..!!

అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – విమాన ఇంధనం) ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, భారతదేశపు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తన దేశీయ మరియు అంతర్జాతీయ విమాన చార్జీలను భారీగా పెంచింది.

పెంచిన ఈ కొత్త చార్జీలు రేపటి (అక్టోబర్ 6) నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పండుగలు, సెలవుల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వెలువడిన ఈ చార్జీల పెంపు ప్రకటన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

కొత్త చార్జీల సవరణ ప్రకారం, దేశీయ విమాన ప్రయాణాల్లో 500 కిలోమీటర్ల లోపు దూరానికి అదనంగా రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్ల ప్రయాణ దూరానికి రూ.600 వరకు ఇంధన చార్జీగా వసూలు చేయనున్నారు. అంతేకాకుండా సార్క్ (SAARC) దేశాల ప్రయాణాలకు 500 కి.మీ. లోపు రూ.1,000, అంతకంటే ఎక్కువ దూరానికి రూ.3,000 వరకు చార్జీలు పెంచారు.

అదేవిధంగా, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాలు, ఉత్తర మరియు తూర్పు ఆసియా దేశాలకు చేసే విమాన ప్రయాణాలపై అదనపు ఇంధన చార్జీగా రూ.5,500 వసూలు చేయనున్నారు. ముఖ్యంగా యూరప్ వంటి సుదూర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఏకంగా రూ.10,000 వరకు చార్జీలు అదనంగా పెంచినట్లు ఇండిగో తెలిపింది. ముడిచమురు ధరల పెరుగుదల వల్లే అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *