ఢాకా: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో, నిద్రిస్తున్న తన భర్త జననాంగాన్ని భార్య కోసేసిన దారుణ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌కు చెందిన హనీఫ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగింది? రాత్రి సమయంలో హనీఫ్ భయంకరంగా అరుస్తూ బయటకు పరుగెత్తడం చూసి స్థానికులు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా అతను రెండో వివాహం చేసుకోవాలని చూస్తున్నాడని భార్య సుమియా ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడింది. వీరిద్దరి మధ్య పెళ్లయినప్పటి నుండి గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు.
నిద్రలోనే దారుణం: హనీఫ్ గాఢనిద్రలో ఉన్న సమయంలో, పదునైన బ్లేడుతో సుమియా అతడి జననాంగాన్ని కోసేసింది. నొప్పి భరించలేక హనీఫ్ బయటకు పరుగెత్తుకుంటూ రావడం దగ్గరలోని సీసీటీవీలో రికార్డైంది. స్థానికులు సుమియాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన కేరళలో జరిగిందని తప్పుగా ప్రచారం జరుగుతోంది, కానీ ఇది బంగ్లాదేశ్‌లో జరిగిందని స్పష్టమవుతోంది.
