సోషల్ మీడియాలో ఎప్పుడూ వింతలు, విశేషాలకు కొదవే ఉండదు. కొన్నిసార్లు నవ్వు తెప్పించే ఇలాంటి విషయాలు, మరికొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.
తాజాగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఒక వీడియోలో, నడిరోడ్డుపై పూర్తిగా చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్‌తో కప్పేసిన ఒక కారును చూసి నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సాధారణంగా కార్లకు స్క్రాచెస్, డెంట్లు పడకుండా కాపాడుకోవడానికి టెఫ్లాన్ కోటింగ్ వేయించడమో లేదా ప్రత్యేకమైన కవర్లు వాడటమో చేస్తుంటారు. కానీ ఈ కారు యజమాని మాత్రం భద్రత పేరుతో పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రద్దీగా ఉండే రోడ్డుపై వెళ్తున్న ఆ కారు బంపర్, పక్క భాగాలు, పైకప్పు.. ఇలా మొత్తం భాగాన్ని చెక్కతో చేసిన ఒక పెద్ద బోనులాంటి నిర్మాణంతో పూర్తిగా కప్పేశాడు. చూడటానికి కారు ఏదో ‘హెల్మెట్’ లేదా ‘చెక్క బోను’ ధరించినట్లుగా విచిత్రంగా కనిపిస్తోంది. ట్రాఫిక్ రద్దీలో చిన్నపాటి ఢీకొనడాల నుంచి కారును కాపాడుకోవడానికి ఇంతటి తెలివైన ఆలోచన ఎవరి బుర్రలో పుట్టిందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ విచిత్రమైన కారు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే, కామెంట్ సెక్షన్లలో నెటిజన్లు రకరకాల మీమ్స్, కామెంట్లతో సందడి చేస్తున్నారు. “అంతా బాగానే ఉంది భయ్యా.. కానీ ఇప్పుడు ఈ కారు ముందు డోర్ ఎలా తీయాలి?” అని ఒక యూజర్ సరదాగా ప్రశ్నించారు. మరొకరేమో “స్క్రాచెస్ పడకుండా ఉండేందుకు బండి నిండా అగ్గిపుల్లలు అంటించినట్టుంది, భలే కామెడీగా ఉంది!” అంటూ ఆటపట్టించారు.

Leave a Reply