ఆత్మానామ్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ భోజనం చేసిన తర్వాత ఇచ్చిన బిల్లులో, రూ.40 ఎంఆర్‌పి ఉన్న రెండు కూల్ డ్రింక్ క్యాన్‌లకు ఒక్కొక్కదానికి రూ.100 చొప్పున మొత్తం రూ.200 వసూలు చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది.
ముద్రించిన గరిష్ట రిటైల్ ధర కంటే రెండు రెట్లు ఎక్కువగా అదనపు మొత్తం వసూలు చేయడాన్ని ఆ కస్టమర్ గమనించి, సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ లేదా అదనపు రుసుము ఏమైనా ఉంటే, దానిని కస్టమర్ భోజనం చేయడానికి ముందే పారదర్శకంగా తెలియజేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంజసమైన, పారదర్శకమైన ధరలనే కస్టమర్లు ఆశిస్తున్నారని చెబుతూ, ఈ అదనపు రుసుముపై రెస్టారెంట్ యాజమాన్యం వివరణ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply