ఒకప్పుడు సోషల్ మీడియా ప్రతిభను చాటుకునే వేదికగా ఉండేది. కానీ నేడు, లైక్స్ మరియు వ్యూస్ కోసం ఏదైనా చేయవచ్చు అనే స్థాయికి చాలామంది దిగజారిపోవడం విచారకరం.
ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ఒక కొత్త జంటకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి, తోటి ప్రయాణికుల ముందే వారు పరిధులు దాటి చేసిన ‘రొమాన్స్’ అక్కడి వారిని ఇబ్బందికి గురిచేసింది. తాము ఏదో ఏకాంతంలో ఉన్నట్లుగా వారు చేసిన అసభ్యకర పనులను, దూరంగా ఉన్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేయడంతో అదిప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.
నెటిజన్ల ఆగ్రహం: ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అంత కోరిక ఉంటే ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ బుక్ చేసుకుని వెళ్లవచ్చు కదా? బహిరంగ ప్రదేశంలో ఈ విన్యాసాలేంటి?” అని ఒకరు మండిపడగా, “ఇంట్లో సమయం దొరకలేదా? రైలులోకి వచ్చి అందరికీ వేడుక చూపిస్తున్నారు” అని మరొకరు ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా, బహిరంగ ప్రదేశాల్లో హుందాగా ప్రవర్తించాలనే కనీస జ్ఞానం లేకపోవడం సామాజిక పతనానికి నిదర్శనమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
