బీహార్‌కు చెందిన రాజీవ్ గుప్తా అనే యువకుడు, తన చైనీస్ భార్య నవ్య గుప్తా (లియు డాన్)తో కలిసి చైనాలోని ఓ ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన అనుభవాన్ని పంచుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది.
చైనాలోని ‘జెజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన రాజీవ్, అక్కడి భద్రత, ఆధునిక వసతులను చూసి ఆశ్చర్యపోయాడు. ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దనే విమానాశ్రయం తరహాలో భద్రతా తనిఖీలతో పాటు, అత్యవసర సమయాల్లో రోగులను తరలించేందుకు హెలికాప్టర్ వసతి కూడా ఏర్పాటు చేశారు.
ఆసుపత్రి ప్రాంగణం మొత్తం అత్యాధునిక సాంకేతికతతో, అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. సందర్శకులు, రోగులకు సహాయం చేయడానికి వాలంటీర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఏ భాష వారైనా సులభంగా అర్థం చేసుకునేలా ఇంగ్లీష్ గైడ్ (మార్గదర్శక) వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
అల్ట్రాసౌండ్ పరీక్ష పూర్తయిన తర్వాత, వైద్యుడు రాసిచ్చిన మందులు ఆటోమేటిక్ కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా ఫార్మసీ కౌంటర్‌కు చేరుకునేలా అక్కడి సాంకేతిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి పరిశుభ్రత, తాగునీటి వసతి, అత్యాధునిక సదుపాయాలు ఉండటాన్ని లైవ్‌గా చూపించిన రాజీవ్ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply