ఇదేంట్రా కార్పొరేట్ కంపెనీలకు వచ్చిన కొత్త తలనొప్పి?. “వచ్చే వారం ఆఫీస్‌కి వస్తున్నా!”. రిజెక్ట్ చేసిన కంపెనీకే అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన యువకుడు.!!

సాధారణంగా ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ నుంచి రిజెక్షన్ ఈమెయిల్ వస్తే ఎవరైనా తీవ్ర నిరాశకు గురవుతారు.

కానీ, ఇటీవల ఓ యువకుడు కంపెనీ పంపిన రిజెక్షన్ మెయిల్‌కు ఇచ్చిన వెరైటీ రిప్లై ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దరఖాస్తు తిరస్కరణకు గురైందన్న సమాచారం రాగానే నిరుత్సాహపడకుండా.. ఆ కంపెనీకే తిరిగి ఒక ‘రిజెక్షన్ రివర్స్ మెయిల్’ పంపించాడు. అందులో.. “నా అప్లికేషన్‌ను తిరస్కరించడంలో మీరు చూపిన ఆసక్తికి ధన్యవాదాలు. ఈ ఏడాది నాకు ఇప్పటికే ఎన్నో కంపెనీల నుంచి రిజెక్షన్ లెటర్లు వచ్చాయి. కాబట్టి, ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత మీరిచ్చిన ఈ రిజెక్షన్‌ను నేను తిరస్కరించాలని (ఆమోదించకూడదని) నిర్ణయించుకున్నాను. త్వరలోనే మీ కంపెనీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ఎంతో హాస్యభరితంగా, కార్పొరేట్ స్టైల్‌లోనే ధైర్యంగా బదులిచ్చాడు.

ఈ వినూత్నమైన ఈమెయిల్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపట్లోనే హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగ వేటలో ఎదురయ్యే నిరాశను ఆ యువకుడు ఎంతో పాజిటివ్‌గా, సరదాగా ఎదుర్కొన్న తీరును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “కంపెనీలు రెగ్యులర్ ఫార్మాట్‌లో అందరికీ ఒకేలాంటి రిజెక్షన్ లెటర్లు పంపినట్లే, వారికి కూడా అదే బాణీలో పంచ్ రిప్లై ఇవ్వడం అద్భుతం” అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. వరుస రిజెక్షన్లతో సతమతమవుతున్న ఎందరో ఉద్యోగార్థులకు ఈ యువకుడి కొంటె ఆలోచన మంచి ఉపశమనాన్ని, ముఖంలో చిరునవ్వును తెప్పిస్తూ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.


Posted

in

by

Tags: