బంగ్లాదేశ్లో ఆధునిక దుస్తులు (Modern dress) ధరించినందుకు ఇద్దరు యువతులపై అతి కిరాతకంగా దాడి జరిగిన దిగ్భ్రాంతికర వీడియో ఒకటి ఎక్స్ (X) సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది.
ఆ యువతులు ఆధునిక దుస్తులు ధరించడం తమ సంప్రదాయానికి విరుద్ధమని వాదిస్తూ, ఒక వ్యక్తి వారిని బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా కొట్టాడు.
ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపించి, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఒక మహిళకు ఉండే కనీస దుస్తుల స్వేచ్ఛలో తలదూర్చి, ఇలా అనాగరికంగా హింసకు పాల్పడటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన అక్కడ మహిళల భద్రతపై మరియు వ్యక్తిగత స్వేచ్ఛపై పెద్ద ఎత్తున ఆందోళనలను రేకెత్తిస్తోంది.
