కాన్పూర్: తన భార్య పరాయి వ్యక్తులతో సంబంధం పెట్టుకుందని ఆగ్రహించిన ఒక యువకుడు, ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కేవలం నాలుగు నెలలకే ఈ ఘోరం జరగడం గమనార్హం.
మృతదేహాన్ని గొంగళి (బ్లాంకెట్)లో చుట్టి ఇంట్లోనే వదిలేసి, మరుసటి రోజే నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ప్రేమ వివాహం.. పెళ్లైన నాలుగు నెలలకే..
నిందితుడు సచిన్ సింగ్, గత నెల రోజులుగా తన భార్య శ్వేతా సింగ్‌తో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లిన వీరు, నాలుగు నెలల క్రితమే కోర్టులో వివాహం చేసుకున్నారు.
అనుమానం.. పక్కా ప్లాన్
పోలీసుల విచారణలో సచిన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వేత ప్రవర్తనపై అతనికి కొద్దిరోజులుగా అనుమానం కలిగింది. తాను పనికి వెళ్లిన సమయంలో, పక్కింటి గదుల్లో ఉంటున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో ఆమె సంబంధం పెట్టుకుందని సచిన్ ఆరోపించాడు. నిజం తెలుసుకోవడానికి, రెండు రోజుల క్రితం తాను ఊరికి వెళ్తున్నట్లు భార్యకు అబద్ధం చెప్పి సచిన్ బయలుదేరాడు.
బెడ్‌పై ఇద్దరితో ఉండగా..
శుక్రవారం రాత్రి అనూహ్యంగా సచిన్ ఇంటికి తిరిగివచ్చాడు. ఆ సమయంలో తన భార్య ఇద్దరు వ్యక్తులతో కలిసి మంచంపై ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే తన మొబైల్ ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే, ఆ వీడియో తీయడం చూసిన శ్వేత, తనపై దాడి చేయమని ఆ వ్యక్తులను రెచ్చగొట్టిందని సచిన్ ఆరోపించాడు. అప్పట్లో పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకుని అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాక హత్య
పోలీస్ స్టేషన్లో విచారణ జరిగిన తర్వాత గొడవ ముదిరింది. “వారేమీ తప్పు చేయలేదని, వారిని ఏమీ అనవద్దని.. లేదంటే నిన్ను వదిలేసి వారితోనే ఉంటానని” శ్వేత వాదించింది. ఆ వ్యక్తులు కూడా సచిన్‌ను చంపేస్తామని బెదిరించారు. ఆవేశం ఆపుకోలేకపోయిన సచిన్, తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని కంబళిలో చుట్టి ఇంట్లోనే వదిలేసి, మరుసటి రోజు ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా శ్వేత మృతదేహం లభ్యమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
