ఇద్దరు పిల్లల తల్లి అయిన ఒక బార్ డ్యాన్సర్, తనను తాను కాలేజీ విద్యార్థినిగా పరిచయం చేసుకుని ఒక వ్యాపారవేత్తను ప్రేమించినట్లు నటించి, హనీట్రాప్ వలలో బంధించి రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించిన షాకింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
విలాసవంతమైన జీవితానికి ఆశపడి, అమాయక వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో వల విసిరిన ఆ మహిళ, చివరకు పోలీసుల పక్కా వ్యూహంతో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైంది.
బాధితుడైన వ్యాపారవేత్తతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్న ఆ మహిళ, తాను ఢిల్లీలోని ఒక కాలేజీలో చదువుతున్నానని అబద్ధం చెప్పింది. క్రమంగా ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చి, ఆ వ్యాపారవేత్తను ఏకాంతంగా కలిసేలా చేసింది.
ఆ కలయిక సమయంలో వ్యాపారవేత్తకు తెలియకుండా కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసుకున్న ఆ మహిళ, కొద్ది రోజుల్లోనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని, కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తూ, వెంటనే రూ. 20 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది.
భయాందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక పక్కా ప్లాన్ వేశారు. పోలీసుల సూచనల మేరకు, డబ్బు ఇస్తానని చెప్పి ఆ మహిళను ఒక నిర్దిష్ట ప్రదేశానికి పిలిపించిన వ్యాపారవేత్త, ఆమెకు డబ్బు బ్యాగ్ ఇస్తున్నట్లు నటించాడు.
అప్పటికే అక్కడ మాటువేసిన స్పెషల్ పోలీస్ టీమ్ ఆ మహిళను చుట్టుముట్టి అరెస్ట్ చేసింది. విచారణలో ఆమె కాలేజీ విద్యార్థిని కాదని, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె డ్యాన్స్ బార్‌లో పనిచేసేదని తేలింది. ఆన్‌లైన్‌లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన ద్వారా పోలీసులు ప్రజలను మరోసారి హెచ్చరించారు.

Leave a Reply