బీహార్ రాష్ట్రంలో, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమించుకుని కోర్టు మ్యారేజ్ చేసుకున్న 9 నెలలకే, తనకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించిందన్న కోపంతో 21 ఏళ్ల భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సంజీవ్ సా, దామినీ దేవి అనే ఇద్దరు గత రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు మొదలైన నేపథ్యంలో, సంజీవ్ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు; కానీ ఇందుకు దామిని అంగీకరించలేదని సమాచారం.
దీంతో ఆగ్రహానికి గురైన భర్త సంజీవ్, గత శనివారం నాడు భార్యను జనసంచారం లేని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తాను ముందుగానే దాచిపెట్టిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు.
మంటల్లో కాలిపోయి తీవ్ర గాయాలపాలైన దామినిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతక భర్తను పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.

Leave a Reply