“ఇన్‌స్టా ప్రేమ”. 2 ఏళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్.. పెద్దల వ్యతిరేకతను ఎదిరించి కొనసాగిన బంధం.. దొంగచాటుగా కలుసుకున్న జంట.. చివరకు ఊరంతా ఒక్కటై ఇరు కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం జరిపించిన హృద్యమైన ఘటన..!!

బీహార్ రాష్ట్రం మోతిహారికి చెందిన ఆరతి కుమారి, ఛతౌనీకి చెందిన దేవా దాస్ అనే ఇద్దరి మధ్య గత రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఈ స్నేహం క్రమంగా తీవ్రమైన ప్రేమగా మారడంతో, ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్లి ఒకే ఇంట్లో ‘లివ్-ఇన్’ (సహజీవనం) పద్ధతిలో కలిసి జీవించడం ప్రారంభించారు.

వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దలు ఇద్దరినీ కలుసుకోకూడదని ఆంక్షలు విధించినప్పటికీ, ఆరతి, దేవా దొంగచాటుగా కలుసుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. దీనివల్ల తలెత్తిన కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా, పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులతో పంపించేశారు.

పోలీసుల హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఇద్దరూ తరచుగా కలుసుకుంటుండటంతో, వీరి వ్యవహారం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని నిర్ణయించిన గ్రామస్తులు, సామాజిక కార్యకర్తలు.. ఇరు కుటుంబాల పెద్దలను స్వయంగా పిలిపించి శాంతియుతంగా చర్చలు జరిపారు.

చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో (గ్రీన్ సిగ్నల్‌తో), గ్రామస్తులే దగ్గరుండి సమీపంలోని ఒక గుడికి పండితుడిని రప్పించి ఆరతి – దేవా జంటకు ఘనంగా వివాహం జరిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై పలు అడ్డంకులను అధిగమించిన వీరి ప్రేమకథ.. చివరకు గ్రామస్తుల చొరవతో పెళ్లి పీటలెక్కడం ఆ ప్రాంత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *