ఇప్పుడు బంగారం కొనకండి.. ఆనంద్ శ్రీనివాసన్ సంచలన ట్విస్ట్! ఎందుకు వద్దంటున్నారో తెలుసా?

సాధారణంగా సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి అని, దానిని కొనమని ఎప్పుడూ సలహా ఇచ్చే ఆర్థిక నిపుణుడు ఆనంద్ శ్రీనివాసన్, ఇప్పుడు మాత్రం “బంగారం కొనకండి.. కొంచెం వేచి చూడండి” అని బాంబు పేల్చారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరంగా చూద్దాం.

ఆనంద్ శ్రీనివాసన్ విశ్లేషణ:

బంగారం ధరలు ప్రస్తుతం ఏమాత్రం ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందిస్తూ..

  • టార్గెట్లు అన్నీ దాటేశాయి: గోల్డ్‌మన్ సాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు 2026 డిసెంబర్ నాటికి బంగారం ఒక ఔన్సు (Ounce) ధర 4800 డాలర్లకు చేరుతుందని అంచనా వేశాయి. కానీ, జనవరి నెల పూర్తి కాకముందే ధర ఆ స్థాయిని దాటి 4870 డాలర్లకు చేరింది.
  • ధరల భారీ పెరుగుదల: ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు (పన్నులతో కలిపి) దాదాపు ₹16,000 తాకింది.
  • డొనాల్డ్ ట్రంప్ ప్రభావం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలపైనే బంగారం ధరలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఆయన ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తే (ఉదాహరణకు గ్రీన్‌లాండ్ అంశం లేదా వాణిజ్య సంబంధాలు), అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 10% వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే కిలోకు ధర ₹12,500 వరకు దిగి రావచ్చు.
ముఖ్యమైన సూచనలు:
  1. స్వల్పకాలికం వద్దు: ప్రస్తుతం బంగారం మార్కెట్ కూడా స్టాక్ మార్కెట్ లాగే తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతోంది. మీరు ఈరోజు కొని 5 ఏళ్ల పాటు దాని గురించి మర్చిపోతాము అనుకుంటేనే కొనండి.
  2. అవసరం ఉంటేనే: ఇంట్లో పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు ఉంటే తప్ప, ఇప్పుడు పెట్టుబడి కోసం బంగారం జోలికి వెళ్లడం రిస్క్ అని ఆయన హెచ్చరించారు.
  3. వేచి చూడండి: ధర ₹12,500 (గ్రాముకు) స్థాయికి వస్తే కళ్లు మూసుకుని కొనవచ్చని, కానీ ఇప్పుడున్న గందరగోళ పరిస్థితుల్లో దూరం ఉండటమే మేలని ఆయన సూచించారు.

Posted

in

by

Tags: