ఇరాన్‌లో అమెరికా సైన్యం అడుగుపెడితే రష్యా జోక్యం? ప్రపంచాన్ని వణికించిన తాజా ప్రకటన!

పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే సైనిక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా గనుక భూతల దాడులకు (Ground Invasion) దిగితే, ఇరాన్‌కు మద్దతుగా రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన చెచెన్ సైనిక విభాగాలు (Chechen units) రంగంలోకి దిగుతాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ప్రెస్ టీవీ’ (Press TV) వెల్లడించిన ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున కీలక పాత్ర పోషిస్తున్న చెచెన్ పోరాట యోధులు ఇరాన్‌కు చేరుకుంటే, యుద్ధ గతి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

సిద్ధమైన చెచెన్ దళాలు: రష్యన్ ఫెడరేషన్‌లో భాగమైన చెచ్న్యా పాలకుడు రంజాన్ కదిరోవ్ నేతృత్వంలోని ‘అఖ్మత్’ (Akhmat) స్పెషల్ ఫోర్స్ దళాలు ఇరాన్ సైన్యంతో కలిసి పోరాడటానికి సిద్ధమని ప్రకటించాయి. ఇది కేవలం రాజకీయ యుద్ధం మాత్రమే కాదని, పాశ్చాత్య దేశాల దురాక్రమణకు వ్యతిరేకంగా చేసే ‘మత యుద్ధం’ (Holy War) అని చెచెన్ నాయకత్వం అభివర్ణించింది. అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపై కాలు మోపితే, అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని రష్యా అనుకూల వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

చొరబడే వారి “కాళ్లు నరికేస్తాం”: మరోవైపు, ఇరాన్ కూడా అత్యంత ఘాటుగా స్పందించింది. ఇరాన్ సంయుక్త సైనిక ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ (Khatam al-Anbiya) ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి మాట్లాడుతూ.. తమ దేశాన్ని ఆక్రమించాలనుకునే శత్రువులను నిర్దాక్షిణ్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి చేయడానికి ప్రయత్నించే వారి “కాళ్లను నరికేస్తాం” అని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇరాన్ చమురు కేంద్రాలు మరియు సైనిక స్థావరాలపై దాడులకు ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


Posted

in

by

Tags: