“ఇరాన్ గగనతలంలో అమెరికా ఫైటర్ జెట్ ధ్వంసం? యుద్ధ మేఘాల మధ్య సంచలన మలుపు!”

టెహ్రాన్: ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ‘ఎఫ్-35’ (F-35) యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరో సంచలన వార్త బయటకు వచ్చింది. కూలిపోయిన విమానం నుండి ప్రాణాలతో బయటపడిన అమెరికన్ పైలట్‌ను ఇరాన్ సైన్యం బందీగా పట్టుకున్నట్లు సమాచారం.

ఇరాన్ వార్తా సంస్థ ‘తస్నిమ్’ కథనం ప్రకారం.. విమానం కూలిపోయే ముందు పైలట్ పారాచూట్ ద్వారా కిందకు దూకాడు. ఇరాన్ భూభాగంలో ల్యాండ్ అయిన పైలట్‌ను అమెరికా సైన్యం రక్షించేలోపే, ఇరాన్ దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇది అమెరికా మరియు ఇజ్రాయెల్‌లకు కోలుకోలేని దెబ్బ అవుతుంది.

ఘటన ఎక్కడ జరిగింది? పశ్చిమ ఇరాన్‌లోని కోహ్గిలుయే మరియు బోయర్-అహ్మద్ ప్రాంంతాల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. IRGC అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేసింది. పైలట్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇరాన్ సేనలు అతడిని చుట్టుముట్టాయి.

అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది పైలట్‌ను బందీగా పట్టుకున్నట్లు ఇరాన్ సైన్యం లేదా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ‘లేకెన్‌హీత్ స్క్వాడ్రన్’‌కు చెందిన విమానంగా దీనిని భావిస్తున్నారు. ఎవరూ ఓడించలేనిదిగా పేరున్న F-35 విమానాన్ని కూల్చడం ద్వారా, శాంతి చర్చల్లో ఇరాన్ తన పైచేయి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: