ఇరాన్: చెప్పిందే చేసిన ఇరాన్; అమెరికన్ ఐటీ సంస్థ ‘అమెజాన్’పై దాడి

రేపటితో ఇరాన్ యుద్ధం ఐదో వారంలోకి అడుగుపెడుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు.. ప్రతిగా మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న అమెరికా ఆస్తులపై ఇరాన్ జరుపుతున్న దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

దాడి వివరాలు: నిన్న ఇరాన్ యొక్క ‘రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (Revolutionary Guard Corps) ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ‘ఏప్రిల్ 1వ తేదీ నుండి గూగుల్, ఆపిల్, మెటా వంటి అమెరికన్ టెక్నాలజీ సంస్థల పై దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది.

అన్నట్టుగానే, నిన్న బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services – AWS) కేంద్రంపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ దాడి వల్ల అమెజాన్ సంస్థకు తక్షణమే భారీ నష్టం వాటిల్లనప్పటికీ, దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియరాలేదు.

అసలు సమస్య ఏమిటి? ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేంద్రం చాలా కీలకమైనది. పశ్చిమ ఆసియా దేశాల్లో అమెజాన్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రభుత్వ వెబ్‌సైట్ల నిర్వహణ ఇక్కడి నుండే జరుగుతుంది.

ఒకవేళ ఇందులో డేటా పాక్షికంగా నశించినా.. డేటా సేకరణ, నెట్‌వర్క్ కనెక్టివిటీ మరియు క్లౌడ్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యకు అమెరికా ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.


Posted

in

by

Tags: