“ఇరాన్ సైన్యం కొత్త విస్వరూపం!”.. అమెరికాను వణికించిన మొజ్తబా ఖమేనీ; ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసిన 5 కీలక నిర్ణయాలు!

ఇరాన్‌పై దాడి చేస్తే ఆ దేశం కుప్పకూలుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గట్టి షాక్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం మొదలై 34 రోజులు కావస్తున్న తరుణంలో ఆయన తీసుకున్న 5 దూకుడు నిర్ణయాలు అగ్రరాజ్యం అమెరికాను తలవంచేలా చేస్తున్నాయి.

ముఖ్యంగా, ప్రపంచానికి ముడిచమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధిని’ వెంటనే మూసివేయడం ద్వారా మొత్తం ప్రపంచ దేశాల దృష్టిని ఇరాన్ వైపు తిప్పారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్, ఇప్పుడు అక్కడ నుండి వెనక్కి తగ్గే పరిస్థితికి చేరుకున్నారు. మొజ్తబా ఎక్కడున్నారో అమెరికా నిఘా సంస్థలు (Intelligence agencies) కూడా కనిపెట్టలేనంత రహస్యంగా ఉంటూ, ఆయన ఒక ‘మిస్టరీ మ్యాన్’ లా వ్యవహరించడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇది మాత్రమే కాకుండా, ఇరాన్ సైన్యాన్ని చిన్న చిన్న బృందాలుగా విభజించి, వారు అనుకున్న సమయంలో దాడులు చేసేలా అధికార వికేంద్రీకరణ చేయడం అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. అమెరికాకు మద్దతుగా నిలిచిన బ్రిటన్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో భయపడిపోయిన బ్రిటన్, ఇప్పుడు యుద్ధం నుండి తప్పుకుంది. దీనివల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా ఒంటరి అయిపోయింది. కేవలం లిఖితపూర్వక ఉత్తర్వుల ద్వారానే ఇరాన్‌ను నడిపిస్తున్న మొజ్తబా, అమెరికా చేసే తప్పుడు ప్రచారాలు ఏవీ పారకుండా సమాచార వ్యవస్థను బలోపేతం చేశారు.

“అమెరికా లొంగిపోయే వరకు యుద్ధం ఆగదు” అని ఇరాన్ హెచ్చరించడం ట్రంప్ యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


Posted

in

by

Tags: