“ఇలాంటి దారుణాన్ని కలలో కూడా ఊహించలేం!”.. టాయిలెట్ గొడవలో యువకుడికి ఎదురైన ఘోరం.. హృదయాన్ని కలిచివేసే ఘటన..!

రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో మరుగుదొడ్డి (టాయిలెట్) ఉపయోగించే విషయంలో తలెత్తిన వివాదంలో, ఒక యువకుడి మలద్వారం గుండా 4 అడుగుల పొడవైన షవర్ పైపును శరీరంలోకి చొప్పించిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. యువకుడి శరీరంలోకి పొడవైన పైపు వెళ్లడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన నెలకొంది.

ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, శరీరంలో ఉన్న 4 అడుగుల షవర్ పైపును విజయవంతంగా బయటకు తీశారు. అయితే, ఈ ఘటన వల్ల యువకుడి పెద్దపేగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఈ దారుణ ఘటనపై బాధిత యువకుడు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. టాయిలెట్ వివాదంలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పలు వివరాలు వెలుగులోకి వస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *