“ఈరోజు నీ రక్తం తాగేంతవరకు వదిలిపెట్టను!” బుసలు కొట్టిన పామును ముక్కలు ముక్కలుగా చీల్చిచెండాడిన ముంగిస.. పల్లెటూరిలో భీకర పోరాటం.. నెట్టింట వైరల్ వీడియో.!

తెలంగాణ రాష్ట్రం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బెజ్జూర్ మండలం, నాగులవాయి గ్రామంలో ఓ అరుదైన ప్రకృతి దృశ్యం చోటుచేసుకుంది.

సాధారణంగా పాముకు, ముంగిసకు మధ్య ఉన్న బద్ధవైరం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ.. నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే ఈ రెండూ ముఖాముఖి తలపడిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని, కలకలాన్ని రేకెత్తించింది.

రోడ్డు పక్కన పాము, ముంగిస ఒకదానిపై ఒకటి విరుచుకుపడుతూ భీకరంగా కొట్టుకున్నాయి. ఈ పోరులో ముంగిస తన మెరుపు వేగంతో కూడిన కదలికలు, రక్షణాత్మక నైపుణ్యంతో పామును ఉక్కిరిబిక్కిరి చేసింది. పాము శరీరంపై, తలపై పదేపదే బలంగా కొరుకుతూ దానికి తీవ్ర గాయాలు చేసి లొంగదీసేందుకు ప్రయత్నించింది. ముంగిస చేసిన నిరంతర ఎదురుదాడితో పాము అక్కడి నుంచి తప్పించుకోలేక ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడింది.

వీటి మధ్య జరిగిన ఈ భీకర సమరంలో పాము తీవ్రంగా గాయపడింది. ముంగిస దాడికి తట్టుకోలేకపోయిన ఆ సర్పం, చివరికి ఘటనా స్థలిలోనే మరణించినట్లు స్థానిక గ్రామస్తులు తెలిపారు. ప్రకృతిలోని ఈ అరుదైన పోరాట దృశ్యాన్ని పలువురు గ్రామస్తులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు.


Posted

in

by

Tags: