ఈ నూనెతో తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుంది!

సాధారణంగా ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం (తెల్లబడటం) అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ తెల్ల జుట్టును దాచడానికి కృత్రిమ హెయిర్ డైలు వాడితే రకరకాల దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వస్తాయి. అందుకే సహజసిద్ధమైన డైని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ పోస్ట్‌లో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  1. కొబ్బరి నూనె – 200ml
  2. కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) – 2 స్పూన్లు
  3. గోరింటాకు – ఒక గుప్పెడు
  4. గుంటగలగర ఆకు పొడి (భృంగరాజ్ పొడి) – 1 స్పూన్

తయారీ విధానం:

  1. ముందుగా ఒక ఇనుప కడాయిలో కొబ్బరి నూనె పోసి చిన్న మంటపై వేడి చేయండి.
  2. నూనె వేడెక్కాక, కచ్చాపచ్చాగా దంచిన కలోంజి గింజలను వేసి వేయించండి.
  3. ఆ తర్వాత కొంచెం దంచిన గోరింటాకు ఆకులను కూడా అందులో వేసి 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి.
  4. నూనె రంగు మారిన తర్వాత, అందులో గుంటగలగర ఆకు పొడిని వేసి ఒక నిమిషం పాటు ఉంచి దించేయాలి.
  5. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి.

ఈ నూనెను ఒక వారం పాటు క్రమం తప్పకుండా వాడుతుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.


Posted

in

by

Tags: