న్యూయార్క్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా పరాజయం పాలవుతుందని, ఇది ప్రపంచ క్రమాన్ని పూర్తిగా మార్చేస్తుందని చైనా ప్రొఫెసర్ జియాంగ్ జ్యుక్విన్ సంచలన అంచనా వేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన ఆయన, గతంలో 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయాన్ని, ఇరాన్‌తో యుద్ధం సంభవిస్తుందని కచ్చితంగా ఊహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జియాంగ్ విశ్లేషణలోని ముఖ్యాంశాలు:
యుద్ధ వ్యూహం: అమెరికా-ఇరాన్ యుద్ధం ఒక “వినాశకర పోరాటం” (War of Attrition). ఇరాన్ గత 20 ఏళ్లుగా ఈ యుద్ధం కోసం సిద్ధమైంది. అమెరికా సామ్రాజ్యాన్ని దెబ్బతీయడానికి వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే లక్ష్యంగా చేసుకున్నారు.
నీటి సంక్షోభం: గల్ఫ్ (GCC) దేశాలకు 60% తాగునీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్లను (సముద్రపు నీటిని శుద్ధి చేసే కేంద్రాలు) ఇరాన్ టార్గెట్ చేస్తోంది. కేవలం $50,000 ఖరీదు చేసే డ్రోన్లతో రియాద్‌లోని ప్లాంట్లను ధ్వంసం చేస్తే, రెండు వారాల్లోనే ఆ ప్రాంతంలో తాగునీరు నిలిచిపోతుంది.
AI బుడగ (AI Bubble): గల్ఫ్ దేశాలు సంపాదించే పెట్రో-డాలర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పెట్టుబడిగా వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసి, గల్ఫ్ దేశాలు చమురు అమ్మలేకపోతే.. ఈ AI పెట్టుబడుల బుడగ పేలిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది.
ఖరీదైన యుద్ధం: అమెరికా పాతకాలపు యుద్ధ తంత్రాలను ఉపయోగిస్తోంది. లక్షల డాలర్ల ఖరీదైన మిసైళ్లతో చౌకైన డ్రోన్లను కూల్చడం ఆర్థికంగా అమెరికాకు భారమవుతోంది. అమెరికా వద్ద ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు అయిపోవచ్చని ఆయన హెచ్చరించారు.
భవిష్యత్తు: అమెరికా అజేయ శక్తి అనే ముద్ర పోయి, ప్రపంచం ‘మల్టీపోలార్’ (బహుధ్రువ) దిశగా వెళ్తుంది. పెట్రో-డాలర్ ఆధిపత్యం ముగిసిపోతుంది.

Leave a Reply