హిందూ మతంలోని ప్రత్యేక పండుగలలో వసంత్ పంచమి ఒకటి. వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. పవిత్ర నదుల్లో స్నానాలు కూడా ఆచరిస్తారు. అయితే వసంత పంచమినాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏయే పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వసంత పంచమి రోజు సరస్వతీ దేవి పూజించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే పూజాపాటవాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. ఎందుకంటే మీరు ఎవరి నుంచైతే జ్ఞానం, విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించడం వల్ల మీకే నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం, పంటలకు సంబంధించింది. అందువల్ల ఈ రోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి మానుకోవాలి.
అలాగే ఈ రోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలకు లేకుండా జాగ్రత్త వహించండి. లేకుంటే సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగాను ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రోజు సాత్వకాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే పండ్లు, కాయలు, పాలు మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసానికి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి పాటిస్తే ఇంటిళ్లిపాది సంతోషంగా ఉంటారని నమ్మిక.
