అహ్మదాబాద్లో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి 22 ఏళ్ల యువతిని సుత్తితో కొట్టి చంపేసి, ఆపై దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవడానికి నాటకమాడిన వైనం వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రారంభంలో ఇది ‘హిట్ అండ్ రన్’ ప్రమాదంగా నమోదైంది. ఆగస్టు 12వ తేదీ రాత్రి సోఫియా అనే యువతి తన సోదరుడితో కలిసి మోటార్ సైకిల్పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మరణించినట్లు ప్రచారం చేశారు.
అయితే, ఈ కేసుపై పోలీసులు చేపట్టిన నిశిత విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో సోఫియాను హత్య చేసినందుకు గాను ఆమె తండ్రి మహమ్మద్ ఫారూక్, సోదరుడు మహమ్మద్ హఫీల్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
