ఉత్కంఠభరిత క్షణాలు.! వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. కనురెప్పపాటులో కారు చక్రాల కింద నలిగి మృతి.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు.!!

వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే రోడ్డుపై తల్లిదండ్రుల సరైన పర్యవేక్షణ లేకుండా ఆడుకోవడానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి, కారు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

కారు డ్రైవర్ మలుపు తిరుగుతున్న సమయంలో, కారు ముందు భాగంలోని ‘ఏ-పిల్లర్’ (A-pillar) అడ్డు రావడంతో చిన్నారిని గమనించలేకపోయాడని, ఆ కారణంగానే ఈ ఘోరం జరిగిందని సమాచారం. కనురెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వార్త అందరి హృదయాలనూ కలచివేస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. “వాహనాలు తిరిగే రోడ్లపై చిన్న పిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలకండి. డ్రైవర్లు కూడా మలుపుల వద్ద రోడ్డు సరిగ్గా కనిపించకుండా అడ్డుపడే పిల్లర్లను దృష్టిలో ఉంచుకుని, వాహన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా నడపాలి” అని నెటిజన్లు హెచ్చరిస్తూ విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు.


Posted

in

by

Tags: