ప్రపంచంలోనే అగ్రగామి కృత్రిమ మేధస్సు (AI) చిప్ తయారీ సంస్థ ‘ఎన్విడియా’ (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ వరుస వివాదాలు ముసురుకుంటున్నాయి.
63 ఏళ్ల జెన్సన్ హువాంగ్, చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళతో రహస్య సంబంధం కొనసాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఆయన తన భార్యకు క్షమాపణలు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని చైనాకు సుమారు 2.40 లక్షల ఏఐ చిప్‌లను అక్రమంగా తరలించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై అమెరికా నిఘా సంస్థలు దర్యాప్తు జరుపుతుండగా, ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు సైతం అంతర్గతంగా విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే, ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్తోనూ జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ రెండో ఆరోపణ తెరపైకి వచ్చింది. గత మార్చిలో కాలిఫోర్నియాలో జరిగిన కంపెనీ సదస్సు సమయంలో వీరిద్దరూ ఒకే హోటల్లో కలిసి ఉన్నారని మాజీ ఉద్యోగులను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.
వరుసగా వస్తున్న ఈ ఆరోపణలతో ఎన్విడియా సీఈవో పదవిలో జెన్సన్ కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించే విషయంపై డైరెక్టర్ల బోర్డు ఆలోచిస్తోందని, కొత్త సీఈవోను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వివాదాల నడుమ కంపెనీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ఇదిలా ఉండగా, జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ నెటిజన్ స్పందిస్తూ.. జెన్సన్ను మీ కంపెనీలో ఉద్యోగంలోకి తీసుకోండి అని మస్క్‌ను కోరారు. దీనికి బదులిచ్చిన మస్క్.. ఆయనను తన సంస్థలో నియమించుకోవడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
టెస్లా, స్పేస్ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలను నడుపుతున్న మస్క్ ఇచ్చిన ఈ సమాధానం, జెన్సన్ భవిష్యత్తుపై చర్చను మరింత వేడెక్కించింది. అయితే, ఇది అధికారిక ఉద్యోగ ప్రకటనో లేదా నియామక ఒప్పందమో కాదు. ఒకవైపు కంపెనీ అధినేత పదవికే ముప్పు ఏర్పడగా, మరోవైపు మస్క్ మద్దతు లభించడం అంతర్జాతీయ టెక్ ప్రపంచంలో తీవ్ర సంచలనం రేపుతోంది.

Leave a Reply