“ఎందుకు 45 నిమిషాలు వృథాగా కోడింగ్ రాయాలి..?” ఇంటర్వ్యూలో AI వాడేందుకు అనుమతి అడిగిన డెవలపర్.. రిజెక్ట్ చేసిన కంపెనీ.. వైరల్ అవుతున్న రిజెక్షన్ మెయిల్..!

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంటర్వ్యూలో కోడింగ్ టెస్ట్ రాసేందుకు చాట్‌జీపీటీ (ChatGPT), క్లాడ్ (Claude) లేదా కర్సర్ (Cursor) లాంటి ఏఐ (AI) టూల్స్ ఉపయోగించడానికి అనుమతి అడిగిన ఓ అభ్యర్థి, ఏకంగా ఆ ఉద్యోగాన్నే కోల్పోయిన ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం రియల్ టైమ్ ప్రాజెక్టుల్లో ఎవరూ ఏఐ లేకుండా కోడింగ్ రాయడం లేదని, ఏఐ టూల్స్ 30 సెకన్లలో ఇచ్చే పరిష్కారం కోసం తాను 45 నిమిషాల సమయం ఎందుకు వృథా చేయాలని ఆ అభ్యర్థి ఇంటర్వ్యూవర్‌ను ప్రశ్నించాడు.

అయితే, ఏఐ రాసిన కోడ్‌కు సంబంధించిన ‘టైమ్ కాంప్లెక్సిటీ’ (Time Complexity) గురించి వివరించాలని ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు.. ‘ఆ విషయాన్ని కూడా నేను చాట్‌జీపీటీనే అడిగి చెప్పనా?’ అని అతను ఎదురుప్రశ్న వేయడం ఆ కంపెనీకి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

దీంతో, ప్రాథమికంగా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని (Problem Solving Skills) పెంచుకోవాలని సూచిస్తూ ఆ కంపెనీకి చెందిన టాలెంట్ అక్విజిషన్ బృందం అతడి అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేస్తూ ఈ-మెయిల్ పంపింది.

ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ ‘ఎక్స్’ (X) ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. పనులు వేగవంతం చేసుకోవడానికి ఏఐ వాడకం సహాయపడొచ్చు కానీ, సొంతంగా ఆలోచించి పరిష్కారాలు చూపే ఇంజనీర్‌లనే కంపెనీలు కోరుకుంటాయని పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *