“ఎందుక్రా నీకు ఈ పనికిమాలిన పని..!” రైలు నెమ్మదిగా కదలగానే చేయి వేశాడు.. కానీ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. కదులుతున్న రైలులో కిటికీ గుండా దొంగతనానికి యత్నించిన దొంగకు ప్రయాణికులు ఇచ్చిన ‘సర్ప్రైజ్’.

నెమ్మదిగా కదులుతున్న రైలు కిటికీ గుండా చేయి పెట్టి వస్తువులను దొంగిలించి పారిపోయేందుకు యత్నించిన ఓ దొంగకు, ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సాధారణంగా రైళ్లు స్టేషన్ నుండి బయలుదేరే సమయంలో దొంగతనం చేసి పారిపోవడం దొంగల కిటుకు. కానీ ఈసారి ప్రయాణికుల అప్రమత్తతతో ఆ దొంగ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

కిటికీలోంచి చేయి పెట్టి దొంగతనానికి యత్నించిన దొంగ చేతిని లోపల ఉన్న ప్రయాణికులు గట్టిగా పట్టుకోవడంతో, రైలు కదులుతున్నప్పటికీ అతను తప్పించుకోలేకపోయాడు.

ఆ తర్వాత రైలు ఆగగానే బయట ఉన్నవారి సహాయంతో ప్రయాణికులు ఆ దొంగను రైలు బోగీలోకి లాగి అతడికి సరైన గుణపాఠం చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దొంగలకు ఇలా బుద్ధి చెప్పడం సరైనదేనని కొందరు అంటుంటే, పండుగ సమయం కాబట్టి కాస్త కనికరించి వదిలేయాల్సిందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *