కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉండి కష్టపడిన ఒక వ్యక్తి, సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన భావోద్వేగ దృశ్యం నెటిజన్ల హృదయాలను హత్తుకుంటోంది.
చాలా ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్న భర్త తలుపు తట్టగా, తలుపు తీసిన భార్య ఊహించని రీతిలో తన భర్తను ఎదురుగా చూసి ఆనంద భాష్పాలతో అతడిని గట్టిగా హత్తుకుని బోరున విలపించింది.
ఆ తర్వాత, భర్త పాదాలను తాకి నమస్కరిస్తూ తన ఇన్నాళ్ల నిరీక్షణను, విరహ వేదనను వ్యక్తపరిచింది. కుటుంబ పేదరికాన్ని పోగొట్టడానికి తమ సొంత కోరికలను, బంధుమిత్రుల ప్రేమానురాగాలను త్యాగం చేస్తూ పరాయి దేశాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికుల జీవితాలను, ఆ సుదీర్ఘ విరామం తర్వాత వారు తిరిగి కలిసే ఆనందకర క్షణాల మాధుర్యాన్ని ప్రతిబింబిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు, దీవెనలు అందుకుంటోంది.

Leave a Reply