“ఎప్పుడూ వాట్సాప్ వెబ్ లాగిన్‌లోనే ఉంచకండి..?” కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక.. వెంటనే అప్రమత్తం అవ్వండి..!

సైబర్ నేరాలను అరికట్టే లక్ష్యంతో, వాట్సాప్ వెబ్ (WhatsApp Web) వినియోగదారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది.

వాట్సాప్ వెబ్ ఖాతాను ఎప్పుడూ లాగిన్ స్థితిలోనే ఉంచవద్దని, ఉపయోగించిన ప్రతిసారీ తప్పనిసరిగా లాగ్‌అవుట్ చేయాలని కోరింది.

ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం, తాము పనిచేసే సంస్థల రహస్యాలను వాట్సాప్ వెబ్ ద్వారా షేర్ చేయడాన్ని పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది. పబ్లిక్ లేదా షేర్డ్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరమని పేర్కొంది.

చాలాసేపు లాగిన్ చేసిన స్థితిలోనే ఖాతా ఉంటే, ఇతరులు సులభంగా సమాచారాన్ని చూడటానికి లేదా దుర్వినియోగం చేయడానికి అవకాశం ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల డిజిటల్ భద్రతను నిర్ధారించుకోవడానికి ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

సైబర్ దాడులు, డేటా చోరీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, హోంమంత్రిత్వ శాఖ చేసిన ఈ హెచ్చరిక ప్రజలు, ఉద్యోగుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నపాటి అజాగ్రత్తలే పెద్ద సైబర్ సమస్యలకు దారితీస్తాయని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

కాబట్టి, వాట్సాప్ వెబ్ ఉపయోగించే వారు తమ భద్రతా అలవాట్లను వెంటనే మార్చుకుని, పని పూర్తయిన వెంటనే లాగ్‌అవుట్ చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *