ఎప్‌స్టైన్ పెంచిన రహస్య మొక్క.. శివాలయాల్లో సమర్పించే ఆ పుష్పమేనా? ‘అది తింటే పిల్లల్లా మారిపోతారు’

ప్రసిద్ధ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టైన్‌కు సంబంధించిన విచారణలో తాజాగా ఒక భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్‌స్టైన్ తన సొంత నర్సరీలో అత్యంత శక్తివంతమైన మత్తును ఇచ్చే ‘ట్రంపెట్ ప్లాంట్స్’ (Trumpet Plants) పెంచేవాడని, దీనికి సంబంధించిన ఈమెయిల్ స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

డెవిల్స్ బ్రీత్ (Devil’s Breath): ఈ మొక్కను ‘డెవిల్స్ బ్రీత్’ లేదా ‘డెవిల్స్ ట్రంపెట్’ అని కూడా పిలుస్తారు. ఇందులో స్కోపోలమైన్ (Scopolamine) అనే రసాయనం ఉంటుంది. దీనితో పాటు అట్రోపిన్, హయోసైమిన్ వంటి ఆల్కలాయిడ్లు కూడా ఉంటాయి. ఇది బ్రుగ్మాన్సియా లేదా డాటురా (ఉమ్మెత్త) జాతికి చెందిన మొక్క. డ్రగ్ మాఫియా దీనిని తరచుగా వాడుతుంటుంది. ఈ మత్తుమందు తీసుకున్న వారు ఎదుటివారు చెప్పినట్లు వింటారు (విల్ పవర్ కోల్పోతారు) మరియు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుంచుకోలేరు.

ఎప్‌స్టైన్ ఈమెయిల్‌లో ఏముంది?: 2015లో ఒక ఫోటోగ్రాఫర్ ఎప్‌స్టైన్‌కు పంపిన ఈమెయిల్‌లో.. “స్కోపోలమైన్: కొలంబియా అడవుల్లో పెరిగే అత్యంత శక్తివంతమైన డ్రగ్. ఇది మనిషి స్వయం నిర్ణయాధికారాన్ని హరిస్తుంది” అని పేర్కొన్నాడు. దీనిని తీసుకున్న వారు పిల్లల్లా అమాయకంగా మారిపోతారని కూడా అందులో ఉంది. బహుశా ఎప్‌స్టైన్ తన బాధితులను లొంగదీసుకోవడానికి దీనిని వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

శివుడికి ఇష్టమైన పుష్పం: విశేషమేమిటంటే, ఈ ట్రంపెట్ ప్లాంట్‌ను హిందూ పురాణాల్లో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. దీనిని తెలుగులో ‘ఉమ్మెత్త’ (Datura) అని పిలుస్తారు. ఇది ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది కాబట్టి, దీనిని తపస్సుకు, సహనానికి చిహ్నంగా చూస్తారు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో శివాలయాల్లో ఈ పూలను, కాయలను దేవుడికి సమర్పిస్తారు. అయితే, ఈ మొక్కలోని ఆకులు, వేర్లు, విత్తనాల్లో ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఉంటాయని, మోతాదు మించితే ప్రాణాపాయం సంభవించవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Posted

in

by

Tags: