ఇంటర్నెట్‌లో రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ, కొన్ని వీడియోలు మాత్రం మన కళ్లనే మనం నమ్మలేనంతగా దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక భయానక వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది.
రోడ్డుపై నడిచి వెళ్లే మనుషులపై ఎద్దులు దాడి చేయడం సాధారణమే అయినప్పటికీ, ఈ వీడియోలో ఓ ఎద్దుకు, ఎర్ర చీర కట్టుకున్న మహిళకు మధ్య జరిగిన ఈ ఘటన చూసేవారిని గజగజ వణికిస్తోంది.
ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో ‘హజీ నిజాముద్దీన్ అబ్బాసీ’ (Haji Nizamuddin Abbasi) అనే ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఎర్ర రంగు చీర కట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను చూడగానే అక్కడున్న ఎద్దు ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది.
సాధారణంగా ఎరుపు రంగును చూస్తే ఎద్దులకు కోపం వస్తుందని చెబుతుంటారు కదా, అచ్చం అలాగే ఆ మహిళ వైపు దూసుకొచ్చిన ఆ ఎద్దు.. ఆమెను తన వీపుపైకి అమాంతం ఎత్తుకుని పరుగులు తీస్తూ ఊహించని విన్యాసం చేసింది.
ఈ వీడియో నిజమేనా అని ఏఐ (AI)ని అడగగా.. భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం సాధ్యమేనని బదులిచ్చింది. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియోను ఇప్పటికే లక్షకు పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా ప్రమాదకరమైనదంటూ కామెంట్లు పెడుతున్నారు.
జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. ఓ మహిళను ఎద్దు తన వీపుపై మోసుకుంటూ పరుగెత్తిన ఈ భయానక ఘటన నెటిజన్లలో తీవ్ర ఆశ్చర్యాన్ని, భయాందోళనలను కలిగిస్తోంది.

Leave a Reply