దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు, వేధింపుల ఘటనలపై మాజీ ఆర్మీ అధికారి కుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మహిళలపై హింస పెరుగుతున్న పరిస్థితుల్లో.. తమ భద్రత కోసం మహిళలు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడకూడదని ఆమె సూచించారు. ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ పొందడంతో పాటు, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అవగాహన కూడా కలిగి ఉండాలని ఆమె అన్నారు.
ఇందులో భాగంగా.. ఆత్మరక్షణ కోసం ఉపయోగించే CO₂ ఎయిర్ పిస్టల్ గురించి ఆమె సోషల్ మీడియాలో ఓ అవగాహన వీడియోను షేర్ చేశారు. ఈ తరహా భద్రతా పరికరాలను బాధ్యతగా, సరైన శిక్షణతో మాత్రమే ఉపయోగించాలని ఆమె సూచించారు.
మహిళలు ఎప్పుడూ తమను తాము బలహీనంగా భావించకూడదని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని కుష్బూ పటానీ ప్రోత్సహించారు.
అదే సమయంలో.. ఎలాంటి భద్రతా పరికరమైనా అర్హత కలిగిన నిపుణుల పర్యవేక్షణలో, తగిన శిక్షణతో మాత్రమే ఉపయోగించాలని ఆమె హెచ్చరించారు.
మహిళలపై నేరాలు, వేధింపుల ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో.. మహిళలు తమ వ్యక్తిగత భద్రతపై అవగాహన పెంచుకోవాలన్న ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షించాయి.
మహిళల భద్రత అనేది ప్రభుత్వం మాత్రమే చూసుకోవాల్సిన అంశం కాదని.. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడంతో పాటు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ చర్చ మరోసారి గుర్తు చేస్తోంది.

Leave a Reply