ముంబైకి చెందిన 22 ఏళ్ల AI ఇంజనీర్ వత్సల్, అవతలి వ్యక్తికి తెలియకుండానే వారు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో రహస్యంగా తెలుసుకునేందుకు makeoutwithfriends.lol అనే సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఈ వెబ్సైట్ పనిచేసే విధానం చాలా సులభం. యూజర్లు తమకు నచ్చిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఈ సైట్‌లోని రహస్య జాబితాలో యాడ్ చేయాలి. అవతలి వ్యక్తి మిమ్మల్ని తన జాబితాలో చేర్చనంత వరకు వారికి ఎలాంటి సమాచారమూ తెలియదు. ఒకవేళ వారు కూడా మీ ఫోన్ నంబర్‌ను ఈ వెబ్సైట్లో యాడ్ చేస్తే మాత్రమే, ఇద్దరికీ “మ్యాచ్ (Match)” అయినట్లు నోటిఫికేషన్ వెళ్లి మాట్లాడుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
“ఎవరికీ ప్రత్యక్షంగా ఎదురెళ్లి చెప్పే సంకోచం గానీ, ఇబ్బంది గానీ కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ సైట్‌ను ఉచితంగా రూపొందించాను” అని వత్సల్ తెలిపారు. ఆయన చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో యువత, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
