ఏంటమ్మా ఇలా దిగజారిపోయారు..? ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో నడిరోడ్డుపై తలపడిన ఇద్దరు మహిళలు..! మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కలకలం.. వైరల్ అవుతున్న వీడియో..!

బెంగళూరులోని హెచ్.ఎస్.ఆర్ (HSR) లేఅవుట్‌లో ఆటో చార్జీ విషయమై ఇద్దరు మహిళలకు, ఆటో డ్రైవర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం నడిరోడ్డుపై ఘర్షణగా మారింది.

ఈ ఘటనను అక్కడున్న ఒకరు వీడియో తీయడంతో, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు ఈ వీడియోలో రికార్డయ్యాయి. వాగ్వాదం ముదిరిన సమయంలో మరో మహిళ జోక్యం చేసుకుని ఆ గొడవను ఆపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, సంబంధిత ఇద్దరు మహిళలను సంప్రదించారు. పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయాలని వారిని కోరారు. అయితే, ఫిర్యాదు చేయడానికి తమకు ఒకట్రెండు రోజుల సమయం కావాలని ఆ మహిళలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈలోగా పోలీసులు ఆటో డ్రైవర్‌ను కూడా గుర్తించి విచారించారు.

ఆటో డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఇద్దరు మహిళలు తన ఆటోలో ప్రయాణించారని, చార్జీ విషయంలో వారితో వాగ్వాదం జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా, మహిళలు తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఆటో చార్జీ ఇవ్వడానికి నిరాకరించారని అతను ఆరోపించాడు. ముందుగా మహిళలే తనపై దాడి చేశారని, ఆ తర్వాతే తాను ఎదురుదాడి చేశానని డ్రైవర్ పేర్కొన్నాడు. మహిళల వైపు నుంచి అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత, ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *