“ఏంట్రా ఇక్కడ జరుగుతోంది స్కూల్లో” ఉపాధ్యాయుడినే గొడ్డలితో నరికిన విద్యార్థి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

మలేషియాలోని కూచింగ్ నగరంలో ఉన్న ఒక అంతర్జాతీయ పాఠశాలలో, 16 ఏళ్ల విద్యార్థి ఒకడు తన ఉపాధ్యాయురాలిపై చిన్న గొడ్డలితో దాడి చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

బుధవారం ఉదయం జరిగిన ఈ దాడి సమయంలో, ఆ విద్యార్థి తన నుదుటికి మొబైల్ ఫోన్‌ను తగిలించుకుని దానిని లైవ్‌స్ట్రీమ్ (ప్రత్యక్ష ప్రసారం) చేయడం మరింత ఉద్రిక్తతకు గురిచేసింది.

ఈ దాడిలో అదృష్టవశాత్తూ ఆ ఉపాధ్యాయురాలికి చేతులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, ప్రాణాపాయం తప్పింది. వెంటనే అదుపులోకి తీసుకున్న ఆ బాలుడిని, విచారణ తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం అందుతోంది. పాఠశాలలో ఉపాధ్యాయులకే రక్షణ లేని ఈ ఘటన విద్యా రంగంలో పెద్ద ఎత్తున ప్రశ్నలను లేవనెత్తుతోంది.

దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతూ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు అందరూ తమ దిగ్భ్రాంతిని, తీవ్ర ఖండనలను కామెంట్ల రూపంలో వెలిబుచ్చుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *