ఏం చేసుకుంటావో చేసుకో.. నేను ఇవ్వను! ₹40 కోసం క్యాబ్ డ్రైవర్‌తో మహిళ గొడవ: భగ్గుమంటున్న నెటిజన్లు..

న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కర్తవ్యపథ్ వరకు ప్రయాణించిన ఓ మహిళ, ప్రయాణ చార్జీల్లో ₹40 తక్కువగా ఇచ్చి క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మిగిలిన డబ్బులు అడిగిన డ్రైవర్‌తో, “నేను ఆ డబ్బులు ఇవ్వను.. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ ఆ మహిళ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.

దీంతో తీవ్ర అసహనానికి గురైన డ్రైవర్, ఆమె కస్టమర్ అకౌంట్‌ను చూపిస్తూ.. “ఇకపై ఎవరూ ఈమెకు క్యాబ్ రైడ్ యాక్సెప్ట్ చేయకండి; డబ్బులు ఇవ్వకపోగా, మర్యాద లేకుండా మాట్లాడుతోంది” అని తోటి డ్రైవర్లను హెచ్చరిస్తూ వీడియో తీసి పోస్ట్ చేశాడు.

దానికి ఆ మహిళ ఏమాత్రం తగ్గకుండా, “అవును.. వెళ్లి అందరికీ చెప్పుకో.. ఇక్కడి నుంచి ముందు నువ్వు వెళ్లు” అంటూ కోపంతో అరుస్తూ డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించివేసింది. చిన్న మొత్తానికి డ్రైవర్‌తో ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: