“ఏం పాడుపని చేసి పెట్టారయ్యా!”.. ప్రభుత్వ పాఠశాల భవనం దుస్థితి.. వందకు పైగా చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాలు.. నెట్టింట వైరల్ అవుతున్న ఆందోళనకర దృశ్యం..!!!

బీహార్‌లోని దర్భంగా జిల్లా కిరాత్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సిన దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 1983లో నిర్మించిన ఈ ప్రభుత్వ భవనంలో ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 191 మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. ఎలాంటి నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో పాటు భవనం పాతబడిపోవడంతో పాఠశాల పిల్లర్లు పూర్తిగా బలహీనపడి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదకర స్థాయికి చేరాయి.

పాఠశాల పైకప్పు ఏ క్షణంలోనైనా నెత్తిమీద పడేలా ఉండటంతో, అది కూలిపోకుండా కింద టేబుళ్లు, బెంచీలు, ఇటుకలను పేర్చి ప్రమాదకర రీతిలో ముసారం (సపోర్ట్) పెట్టారు. పిల్లలు కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన తరగతి గదులే మృత్యుకూపాలుగా మారడం స్థానికులను, తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏమాత్రం రక్షణ లేని ఇంతటి ప్రమాదకర వాతావరణంలో పసిపిల్లలు చదువుకోవాల్సి రావడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

బడి గదులు పిల్లలకు అత్యంత సురక్షితమైన ప్రదేశాలుగా ఉండాలన్న కనీస స్పృహ లేని అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ పాఠశాల భవనానికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని లేదా వెంటనే విద్యార్థులను సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనంలోకి తరలించాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *