“ఏఐని ఇలా గుడ్డిగా నమ్మకండి!” మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జారీ చేసిన కీలక హెచ్చరిక..!!

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో, మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్య నాదెళ్ల చేసిన నూతన హెచ్చరిక టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది.

కంపెనీలు మరియు టెక్ ప్రపంచం ఏఐ టూల్స్‌ను అత్యంత తీవ్రంగా వినియోగిస్తున్న నేపథ్యంలో, దీనివల్ల పొంచి ఉన్న ప్రమారాల గురించి ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

ఈ విషయమై మాట్లాడుతూ, సంస్థలు అత్యంత శక్తివంతమైన అధునాతన ఏఐ మోడళ్లను ఉపయోగిస్తున్నప్పుడు, వాటిని ఎప్పడైనా నిలిపివేయడానికి వీలుగా ఒక ‘ఎమర్జెన్సీ బ్రేక్’ (Emergency Brake) లాంటి సురక్షితమైన కంట్రోల్ సిస్టమ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్ల నొక్కిచెప్పారు. అంతేకాకుండా, ఏఐ టెక్నాలజీ అనేది మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులుగా తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునే అంతిమ అధికార వ్యవస్థగా ఎప్పటికీ మారిపోకూడదని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.

ఈ సాంకేతికత మానవాళికి ఏ ఏ స్థాయిలో సహాయపడుతుందో, అదే స్థాయిలో అది అదుపుతప్పి ప్రవర్తిస్తే పెను ముప్పుగా మారుతుందనే నిజాన్ని ఎత్తిచూపుతూ సత్య నాదెళ్ల ఈ హెచ్చరికను జారీ చేశారు. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ టెక్నాలజీని మనం ఎంతటి అప్రమత్తతతో వాడుకోవాలో తెలియజేసే ఆయన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ టెక్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *