ఏఐ గురించి ఆలోచిస్తే రాత్రిపూట నిద్ర రావడం లేదు!! గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన!!

AI (Artificial Intelligence) అనే కృత్రిమ మేధస్సు సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వృద్ది చెందుతోంది.

మానవులు చేసే అనేక పనులు ఇప్పుడు ఏఐ సాంకేతికత చేతుల్లోకి వెళ్లిపోయాయి. మానవులు పదే పదే ఒకే విధంగా చేసే పనులను క్రమంగా ఏఐ సాంకేతికత మరియు ఏఐ ఏజెంట్లు ప్రస్తుతం చేపడుతున్నాయి. కాల్ సెంటర్ పనులు, కస్టమర్ సర్వీస్ పనులు, హెచ్‌ఆర్, కోడింగ్ మొదలైనవి మానవుల నుండి ఏఐ చేతికి వెళ్తున్నాయి. ఇటీవల గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ కూడా ఏఐ సాంకేతికత వలన తన ఉద్యోగానికి ప్రమాదం ఉందని చెప్పి సంచలనం సృష్టించారు. త్వరలోనే తనలాంటివారి సీఈఓ పనులను కూడా ఏఐ లాక్కునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో, ఏఐ సాంకేతికత వలన అన్ని స్థాయిలలో ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ప్రిపోతాయి అనే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.

ఈ సందర్భంలో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సుందర్ పిచాయ్ మరో సంచలనాత్మక అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏఐ సాంకేతికత యొక్క వేగవంతమైన వృద్ధి తనలో భయాన్ని కలిగిస్తోందని, దాన్ని ఆలోచిస్తే రాత్రి వేళల్లో తనకు అసలు నిద్ర రావడం లేదని ఆయన బహిరంగంగా తెలిపారు.

ఫాక్స్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుందర్ పిచాయ్, ఏఐ సాంకేతికత ఎంత వేగంగా వృద్ది చెందుతోంది అనే విషయాన్ని పంచుకున్నారు.

ఏఐ సాంకేతికతలో మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు కూడా ఉన్నాయి అని చుపించిన ఆయన, ఏఐ సాంకేతికత భవిష్యత్తులో అనేక వ్యాధులకు మందులు కనుగొనడంలో సహాయపడుతుందని, ముఖ్యంగా క్యాన్సర్ వంటి నయంకాని వ్యాధులన్నింటికీ మందులు కనుగొనడంలో ఏఐ ముఖ్య పాత్ర వహిస్తుందని తెలిపారు.

అదే సమయంలో ఏఐ సాంకేతికత యొక్క వృద్ధి కొన్ని ప్రతికూల విషయాలను (Negative Things) కూడా తీసుకువస్తుందని, దాన్ని ఆలోచిస్తే తనకు బాధగా ఉందని చెప్పారు. ఏ సాంకేతికతకైనా రెండు వైపులు ఉంటాయని పేర్కొన్న ఆయన, ఒక వైపు సానుకూలంగా (Positive) మరొక వైపు ప్రతికూలంగా (Negative) ఉంటుందని తెలిపారు. ఇది తప్పుడు కార్యకలాపాలకు ఎక్కువగా ఉపయోగించబడే అవకాశం ఉందని చెప్పిన ఆయన, డీప్ ఫేక్ వీడియోలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పారు. డీప్ ఫేక్ వీడియోలు నిజమైన వ్యక్తుల్లాగే ఉండటం తన భయానికి కారణం అని తెలిపిన సుందర్ పిచాయ్, ఈ ఒక్క విషయమే తనను రాత్రి వేళల్లో నిద్రపోకుండా చేస్తోంది అని చెబుతున్నారు.

ఏఐ తప్పుడు కారణాల కోసం ఉపయోగించబడితే ఏమవుతుందో అనే భయం నన్ను ఆవహిస్తోంది అని చెప్పారు. మానవ సమాజానికి ప్రయోజనం అందించేదిగా ఏఐ సాంకేతికత ఉండాలి, ఈ సాంకేతికత కూడా అలాగే ఉండాలి అనేదే తన ఉద్దేశం అని ఆయన చెబుతున్నారు.


Posted

in

by

Tags: