ఏకే-47 తుపాకులతో చొరబడిన ముఠా..! “27 మంది వరుసగా దారుణ హత్య”.. 26 మందికి తీవ్ర గాయాలు.. చెలరేగిన హింస, ఎగిసిపడుతున్న మంటలు.. సంచలన వీడియో..!

దక్షిణాఫ్రికాలో వారాంతంలో జరిగిన రెండు వేర్వేరు భయానక కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ప్రాంతాల సమీపంలో జరిగిన ఈ దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి.

మొదటి దాడి శనివారం (సెప్టెంబర్ 26) రాత్రి 9:30 గంటల సమయంలో జోహన్నెస్‌బర్గ్‌కు నైరుతి దిశలో ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్‌లోని వెడెలా ప్రాంతంలో గల ఓ ప్రముఖ మద్యం శాలలో (బార్‌లో) జరిగింది.

ఏకే-47 తుపాకులు, పిస్టళ్లతో వచ్చిన 8 మందితో కూడిన సాయుధ దుండగుల ముఠా.. బార్ బయట నిలబడి ఉన్న వారిపై మొదట విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఆ తర్వాత బార్ లోపలికి చొరబడి విచ్చలవిడిగా దాడికి తెగబడింది. ఈ దాడిలో 13 మంది పురుషులు, నలుగురు మహిళలతో సహా 17 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు.

కాల్పులు జరిపిన ముఠా, అక్కడున్న కొందరి సెల్‌ఫోన్లను లాక్కుని రెండు వాహనాల్లో పరారైంది. అంతేకాకుండా, అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు వాహనాలకు నిప్పు పెట్టి తగలబెట్టి వెళ్లింది.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే, కేప్ టౌన్ సమీపంలోని లవాండ్లే ప్రాంతంలో ఉన్న ‘షిసాన్యామా’ (కాల్చిన మాంసం విక్రయించే రెస్టారెంట్) వినోద కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున 1:46 గంటల సమయంలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

ఆయుధాలతో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడున్న ప్రజలపై కాల్పులు జరపడంతో, ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 11 మంది గాయపడి అత్యవసర చికిత్స పొందుతున్నారు.

కొద్ది రోజుల క్రితమే డర్బన్ సమీపంలోని క్వామషు ప్రాంతంలో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకల్లోకి చొరబడిన ముఠా.. గర్భిణీ స్త్రీతో సహా 11 మందిని కాల్చి చంపింది. ఆ విషాదం మరువక ముందే ఈ రెండు భారీ నరమేధాలు చోటుచేసుకున్నాయి.

ఈ రెండు దాడులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఇందులో పాల్గొన్న నేరస్తులను పట్టుకునేందుకు దక్షిణాఫ్రికా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *