ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసే కష్టాలకు బ్రేక్ పడనుందా? 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కోసం ప్రభుత్వం పట్టు!

న్యూఢిల్లీ: మొబైల్ రీఛార్జ్ విషయంలో వినియోగదారులకు జరుగుతున్న ‘అన్యాయాన్ని’ సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమైంది. సాధారణంగా మనం ‘నెలవారీ ప్లాన్’ అని పిలుచుకునే రీఛార్జ్‌లు కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటున్నాయి.

దీనివల్ల వినియోగదారులు ఏడాదికి 12 సార్లు కాకుండా, 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను తొలగించడానికి, ఖచ్చితంగా 30 రోజుల పూర్తి వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

నెలలో 30 లేదా 31 రోజులు ఉన్నప్పటికీ, టెలికాం కంపెనీలు కేవలం 28 రోజుల ప్యాక్ మాత్రమే ఇస్తాయి. దీనివల్ల ప్రతి నెలా 2 నుండి 3 రోజులు మిగిలిపోతాయి. ఈ మిగిలిన రోజులన్నీ కలిసి ఏడాది చివరలో వినియోగదారులు ఒక అదనపు రీఛార్జ్ (13వ రీఛార్జ్) చేయాల్సి వస్తోంది.

ఈ ’28 రోజుల వ్యూహం’ ద్వారా టెలికాం కంపెనీలు ప్రతి ఏటా కోట్లాది రూపాయల అదనపు ఆదాయాన్ని గడిస్తున్నాయని రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల గళమెత్తారు.


Posted

in

by

Tags: