సాధారణంగా ఏపీలో జీవన వ్యయం తక్కువని అంటుంటారు. అయితే ఒక కుటుంబం అన్ని సౌకర్యాలతో ప్రశాంతంగా జీవించాలంటే నెలకు ఎన్ని డబ్బులు కావాలో మీకు తెలుసా? మంచి ఆహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని అవసరాలను కలిపి జీవన వ్యయంగా పరిగణిస్తారు.
నిపుణుల అంచనా ప్రకారం కేరళలో జీవన వ్యయం ఇలా ఉంది:
- ఒక్కరే ఉండేవారికి: నెలకు ₹18,000 నుండి ₹30,000 వరకు.
- దంపతులకు (ఇద్దరు): నెలకు ₹30,000 నుండి ₹45,000 వరకు.
- నలుగురు ఉన్న కుటుంబానికి: నెలకు ₹45,000 నుండి ₹70,000 వరకు ఖర్చవుతుంది.
ఆహారపు ఖర్చులు: నిత్యావసర సరుకుల (Groceries) కోసం నెలకు ₹4,000 నుండి ₹7,000 వరకు ఖర్చవుతుంది. కూరగాయలు, పండ్లు, చేపలు వంటివన్నీ కలుపుకుంటే ఆహారం కోసం మొత్తం ₹6,000 నుండి ₹10,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వారానికి ఒకసారి కుటుంబంతో కలిసి బయట భోజనం చేసే అలవాటు తెలుగు వాల్లలో పెరుగుతోంది, దీని కోసం నెలకు ₹2,000 నుండి ₹4,000 వరకు ఖర్చవుతోంది.
ప్రయాణ ఖర్చులు: ప్రయాణాల కోసం ఏపీలో పెద్దగా ఖర్చు కాదని నిపుణులు చెబుతున్నారు.
- బస్సు ప్రయాణం: నెలకు ₹500 నుండి ₹1,200.
- ఆటో/టాక్సీ: నెలకు ₹1,000 నుండి ₹2,000.
- ద్విచక్ర వాహనం (పెట్రోల్): నెలకు ₹1,200 నుండి ₹2,000. ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే ఈ ఖర్చు ఇంకా తగ్గుతుంది.
ఇతర అవసరాలు (Utilities):
- విద్యుత్: ₹800 – ₹2,000
- నీరు: ₹200 – ₹500
- ఇంటర్నెట్: ₹600 – ₹1,200
- మొబైల్ రీఛార్జ్: ₹300 – ₹600
- వైద్యం: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ₹1,000 – ₹2,500, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ₹800 – ₹2,000. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఆరోగ్య సంరక్షణ ఖర్చు తక్కువని నిపుణుల అభిప్రాయం.
విద్యా ఖర్చులు: పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో చదివితే ఫీజుల భారం ఉండదు. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే నెలకు ₹1,500 నుండి ₹5,000 వరకు ఉంటుంది. ఉన్నత విద్యకు ఏడాదికి ₹20,000 నుండి ₹1.5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఈ గణాంకాలు కేవలం ఒక సగటు అంచనా మాత్రమేనని, పరిస్థితులను బట్టి వీటిలో మార్పులు ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
