ఏసీ కోచ్‌లో ఎక్కినా ప్రశాంతంగా ప్రయాణించలేమా.? కదులుతున్న రైలులో మహిళను తోసేసి నగలు, పాస్‌పోర్ట్ ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన దొంగ.! “కాపాడేందుకు ఎవరూ రాలేదే.!” అని రోదించిన మహిళ. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.!!

కదులుతున్న రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ వద్ద చోరీ జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

హౌరా నుంచి జమాల్‌పూర్ వెళ్తున్న 13071 నంబర్ రైలులో, ఏసీ 2-టైర్ (2nd AC) ఏ1 కోచ్‌లో 51వ సీటులో ప్రయాణిస్తున్న మహిళకు సాహిబ్‌గంజ్ సమీపంలో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటనతో తీవ్ర షాక్‌కు గురైన ఆ మహిళ, తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది.

ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి సమయంలో రైలు సాహిబ్‌గంజ్ సమీపంలో వెళ్తుండగా కోచ్‌లోకి ప్రవేశించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఆమె బ్యాగ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. తన వస్తువులను కాపాడుకునేందుకు ఆ మహిళ పోరాడగా, సదరు వ్యక్తి ఆమెను గట్టిగా కిందకు తోసేసి బ్యాగ్‌తో పరారయ్యాడు. ఈ క్రమంలో కిందపడిన ఆమెకు గాయాలైనట్లు కూడా సమాచారం. ఆ బ్యాగ్‌లో బంగారు గొలుసు, పాస్‌పోర్ట్, ముఖ్యమైన గుర్తింపు కార్డులతో పాటు పలు విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె పేర్కొంది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఏసీ కోచ్‌లో భద్రతా సిబ్బంది ఎవరూ లేరని, ఫిర్యాదు చేయడానికి, సహాయం పొందడానికి తాను తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆమె ఆరోపించింది. ఇదే రైలులోని మరో 4 నుంచి 5 కోచ్‌లలో కూడా చోరీ ఘటనలు జరిగాయని ఆమె చెప్పింది. అధిక ధర చెల్లించి ఏసీ 2వ తరగతిలో ప్రయాణిస్తున్నప్పటికీ ప్రయాణికులకు కనీస భద్రత ఎందుకు లేదని ఆమె ప్రశ్నించింది.

మహిళ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, రైల్వే సేవల అధికారిక సోషల్ మీడియా ఖాతా స్పందించింది. దర్యాప్తు జరిపి తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రయాణ వివరాలు (PNR నంబర్), మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరింది. రైళ్లలో భద్రతను పెంచాలని, సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, ప్రతి కొన్ని కోచ్‌లకు గార్డులను నియమించాలని నెటిజన్లు రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *