టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాకుండా, తన సహజసిద్ధమైన అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు.
ఇటీవల కంటెంట్ క్రియేటర్లు, అభిమానులతో రింకూ సింగ్ సరదాగా ముచ్చటిస్తున్న సమయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఒక లేడీ వీడియో క్రియేటర్ ఉన్నట్టుండి రింకూ సింగ్‌ను చూస్తూ “ఐ లవ్ యూ” అని చెప్పింది.
ఆ మాట వినగానే ఏమాత్రం తడుముకోకుండా తనదైన చిరునవ్వుతో మైక్‌లోనే… “నేనేమైనా నీ గర్ల్‌ఫ్రెండ్‌నా ఏంటి?!” అంటూ రింకూ కౌంటర్ వేశాడు. ఊహించని ఈ అదిరిపోయే పంచ్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
క్రికెట్ మైదానంలోనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో జాలీగా ఉండే రింకూ సింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను చూపిస్తున్న ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
