భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్కంఠ ఎప్పుడూ తారాస్థాయిలో ఉంటుంది.
ఆ కోవలోనే, నవంబర్ 8వ తేదీన జరిగిన అండర్-19 ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ హోరాహోరీ పోరులో భారత జట్టును మట్టికరిపించి పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయానికి ప్రధాన కారణం ఆ దేశ ఆటగాడు హంజా జహూర్ (Hamza Zahoor). మ్యాచ్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు, హంజా జహూర్ ఒక చిన్న కాగితంపై తన లక్ష్యాన్ని రాసుకున్నాడు.
అందులో, భారత్‌పై జరిగే మ్యాచ్‌లో తాను అర్ధశతకం (హాఫ్ సెంచరీ) సాధించి, జట్టును గెలిపించాలని అతడు లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. కానీ, తాను అనుకున్నదాని కంటే అద్భుతంగా రాణించిన హంజా.. భారత బౌలర్లను నలుదిక్కులా చెడుగుడు ఆడుకుంటూ అద్భుతమైన సెంచరీ బాదాడు. కేవలం హాఫ్ సెంచరీ కొట్టాలనుకున్న అతడు, తన ప్రతిభతో దానిని సెంచరీగా మార్చి భారత జట్టు చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత తను రాసుకున్న ఆ చిన్న కాగితాన్ని మైదానంలో అందరికీ చూపిస్తూ, తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నందుకు ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ అద్భుత ప్రదర్శన, ఆ చిన్న కాగితం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పాటు, భారత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

Leave a Reply